పుష్కర స్నానాలను అడ్డుకోవడం సాధ్యమేనా..?

ABN , First Publish Date - 2020-11-16T05:30:00+05:30 IST

మరో వారం రోజుల్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే కొవిడ్‌ నేపథ్యంలో పుణ్యస్నానాలకు అనుమతులు లేదని అధికారిక యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం ఘాట్ల వద్ద పుష్కరస్నానాలను నియంత్రించగలరేమోగాని మొత్తంగానే నదీ తీరాల్లో కట్టడి సాధ్యమేనా..? అనే ప్రశ్న తలెత్తుతోంది.

పుష్కర స్నానాలను అడ్డుకోవడం సాధ్యమేనా..?
సంగమేశ్వరంలోని ఎగువ ఘాట్‌లో సమృద్ధిగా ఉన్న నీరు

ఆత్మకూరు, నవంబరు 16: మరో వారం రోజుల్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే కొవిడ్‌ నేపథ్యంలో పుణ్యస్నానాలకు అనుమతులు లేదని అధికారిక యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం ఘాట్ల వద్ద పుష్కరస్నానాలను నియంత్రించగలరేమోగాని మొత్తంగానే నదీ తీరాల్లో కట్టడి సాధ్యమేనా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో ఎగువ ఘాట్లు సిద్ధంగా ఉన్నాయి కానీ పుష్కర స్నానాలకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నిబంధనల వల్ల భక్తులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. 


నదీతీరాల్లో భక్తుల భద్రతకు పొంచి ఉన్న ప్రమాదం 

ఘాట్ల వద్ద పుణ్యస్నానాలకు అనుమతి లేకుంటే భక్తులు నదీ తీరాల్లోని కొత్తపల్లి మండలంలోని జూనాల, పాత సిద్ధ్దేశ్వరం, కపిలేశ్వరం, ఎర్రమఠం, మాడుగుల, ముసలిమడుగు, సింగరాజుపల్లి, భట్టువారిపల్లి, జడ్డువారిపల్లి, కొక్కెరంచ, పగిడ్యాల మండలంలోని ప్రాతకోట, నెహ్రూనగర్‌, ముచ్చుమర్రి తదితర గ్రామాల వద్ద స్నానాలకు సిద్ధమవుతారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని అధికారులు ఎలా నిలువరించగలరనే ప్రశ్నలు ఉన్నాయి. నదీతీర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2020-11-16T05:30:00+05:30 IST