Nupur Sharma వ్యాఖ్యలపై అగ్రరాజ్యం America స్పందన ఇదీ..

ABN , First Publish Date - 2022-06-17T16:45:02+05:30 IST

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. నూపుర్ వ్యాఖ్యలు

Nupur Sharma వ్యాఖ్యలపై అగ్రరాజ్యం America స్పందన ఇదీ..

వాషింగ్టన్: బీజేపీ(BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ(Nupur Sharma) వివాదాస్పద వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా(America) స్పందించింది. నూపుర్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ప్రకటించింది. ‘‘ ఇద్దరు బీజేపీ నేతలు చేసిన నేరపూరిత వ్యాఖ్యలపై ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలను బీజేపీ బహిరంగంగా వ్యతిరేకించడం పట్ల సంతోషంగా ఉన్నాం ’’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్(Ned price) పేర్కొన్నారు. మత స్వేచ్ఛ లేదా విశ్వాసాలకు సంబంధించిన మానవ హక్కుల ఆందోళనలపై ఎప్పటికప్పుడు భారత్‌తో సీనియర్ అధికారుల స్థాయి సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 


కాగా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మే 26న ఓ టీవీ డిబేట్‌లో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా గల్ఫ్ సహా ఇతర ముస్లిం దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ వ్యాఖ్యలపై బీజేపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరో వివాదాస్పద నేత నవీన్ కుమార్ జిందాల్‌పై బహిష్కరణ వేటు వేసింది.

Updated Date - 2022-06-17T16:45:02+05:30 IST