ముగిసిన అంతర్‌ వర్సిటీ రోలర్‌ స్కేటింగ్‌ టోర్నీ

ABN , First Publish Date - 2022-07-03T05:21:36+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల రోలర్‌ స్కేటింగ్‌ టోర్నీ శనివారం ముగిసింది.

ముగిసిన అంతర్‌ వర్సిటీ రోలర్‌ స్కేటింగ్‌ టోర్నీ
పతకాలతో ఏయూ క్రీడాకారులు, సిబ్బంది

ఏయూకు ద్వితీయ స్థానం

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూలై 2: ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల రోలర్‌ స్కేటింగ్‌ టోర్నీ శనివారం ముగిసింది. వీఎంఆర్‌డీఏ పార్కు స్కేటింగ్‌ రింక్‌లో జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఏయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి ముఖ్య అతిఽథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, ఏయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్సు సైన్సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.విజయ్‌మోహన్‌, విభాగాధిపతి డాక్టర్‌ ఎ.పల్లవి, డాక్టర్‌ షారోన్‌ రాజు, రోలర్‌ స్కేటింగ్‌ సమాఖ్య ప్రతినిధులు భగీరఽథ్‌, బల్వీందర్‌ సింగ్‌, ఎస్‌.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

విజేతలు:

స్క్వాడ్‌ రోలర్‌ హాకీ....పురుషుల విభాగంలో ఆలీఘర్‌ యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయు కాకినాడ....మహిళల విభాగంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం,  జేఎన్‌టీయు కాకినాడ తొలి మూడు స్థానాలలో నిలిచాయి. 

ఇన్‌లైన్‌ హాకీ...పురుషుల విభాగంలో జేఎన్‌టీయు కాకినాడ, యూనివర్సిటీ ఆఫ్‌ జుమ్ము కాశ్మీర్‌,  డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌...మహిళల విభాగంలో దేవీలాల్‌ యూనివర్సిటీ,  డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌,  జేఎన్‌టీయు కాకినాడ తొలి మూడు స్థానాలను సాధించాయి.

రోడ్డు రేస్‌ వన్‌లాప్‌....పురుషుల విభాగంలో ఆర్యన్‌పాల్‌ సింగ్‌(ఎండీ యూనివర్సిటీ), వై.ఓంకార్‌(వీటీయు), జి.ప్రభు(వీటీయు)...మహిళల విభాగంలో జాహ్నవి(వీటీయు), రియా ఎలిజిబెత్‌(ఆర్‌టీఎం వర్సిటీ, రైనా(ఎండీయు) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. 



Updated Date - 2022-07-03T05:21:36+05:30 IST