లారీలను అడ్డుకుని రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు
చింతలమానేపల్లి, జనవరి 22: మండలం మీదుగా కంకర లోడ్‌తో వెళ్తున్న లారీలను నడపవద్దని శని వారం బాబాసాగర్ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కొన్నిరోజుల నుంచి మండలంలోని పలు గ్రామాల నుంచి లారీల్లో కంకర తీసుకుని పోతున్నారని అన్నారు. అధిక లోడ్‌తో రోడ్లు గుంతలమ యంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి లారీల రవా ణాను నిలిపివేయాలని డిమాం డ్ చేశారు. విషయం తెలుసు కున్న ఏఎస్సై యాదవ్ సంఘ టన స్థలానికి వచ్చి గ్రామస్థులను సముదాయించారు. సమస్యను పరిష్కరిస్తామని తెలపడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.