పుస్తక పఠనంతో ఏకాగ్రత

ABN , First Publish Date - 2021-01-18T04:56:24+05:30 IST

పుస్తక పఠనంతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి విజ్ఞానం పెంపొందించుకోవచ్చని గ్రంథాలయ నిర్వాహకుడు ఎల్‌.కృష్ణారావు తెలిపారు.

పుస్తక పఠనంతో ఏకాగ్రత
ఎల్‌ఎన్‌పేట: పుస్తక పఠనం చేస్తున్న విద్యార్థులు

శ్యామలాపురం(ఎల్‌.ఎన్‌.పేట), జనవరి 17: పుస్తక పఠనంతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి విజ్ఞానం పెంపొందించుకోవచ్చని  గ్రంథాలయ నిర్వాహకుడు ఎల్‌.కృష్ణారావు తెలిపారు. శ్యామలాపురంలో ఆదివారం జిల్లా విద్యాశిక్షణా సంస్థ ఆదేశాల మేరకు గ్రామీణ గ్రంథాలయంలో విద్యార్థులతో సండే స్టోరీ టైం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని సద్వినియోగంచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు టి. దురా ్గరావు, సభ్యులు గురునాథ్‌, శ్యామ్‌, కేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేగిడి:  రేగిడి శాఖా గ్రంథాలయంలో ఆదివారం రేగిడి ఆమదాలవలస విద్యార్థులు ‘చదవటం మా కిష్టం’ కార్యక్రమంలో భాగంగా  పొడుపు కథలు, ఇతర మహానీయుల చరిత్రలను చదివారు. లైబ్రేరి యన్‌ బీవీ రమణమూర్తి స్వామి వివేకానంద జీవిత్ర చరిత్ర, పొడుపు కఽథలు చదివించారు. కార్యక్ర మంలో శాఖా గ్రంథాలయ అసిస్టెంట్‌ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T04:56:24+05:30 IST