అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-05-28T10:49:04+05:30 IST

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టండి 

మిషన్‌ భగీరథ నీరు ప్రతీఇంటికి చేరేలా చర్యలు  : మంత్రి అల్లోల 


నిర్మల్‌, మే 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌, అటవీ, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి ఐటీడీఏ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. జిల్లాలో సాగు నీటిఅభివృద్ధి పనులపై, మిషన్‌ భగీరథ సరఫరాపై, పైపులైన్‌ మరమ్మతులపై సమీక్షించారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ లో ఎక్కడ కూడా పైపులు లీకేజీ కాకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. మిషన్‌ భగీరథ తాగునీరు జిల్లాలోని ప్రతీఇంటికి చేరేలా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.


ఎలక్ర్టిసిటీ శాఖపై సమీక్షిస్తూ మారుమూల ప్రాంతాల్లో విద్యుత్‌ను సరఫరా చేయాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈని ఆదేశించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఆ తర్వాత జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు 396 ట్రాక్టర్లు, 218 ట్రాలీలు, 104 ట్యాంకర్లను కొనుగోలు చేయడం జరిగిందని, నెలాఖరులోగా మొత్తం ట్రాలీలను కొనుగోలు చేస్తామన్నారు. ఆ తర్వాత కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ మాట్లాడుతూ సమావేశంలో నిర్దేశించిన పనులపై అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ సమావేశంలో నిర్దేశించిన పనులపై అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మీ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఐటీడీఏ పీవో భవేష్‌మిశ్రా, డీఎ్‌ఫవో సుధాన్‌, ఎలక్ర్టిసిటీ ఎస్‌ఈ చౌహన్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, అధికారులున్నారు.


నాగలి పట్టి దుక్కి దున్నిన మంత్రి అల్లోల

నిర్మల్‌ రూరల్‌: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బుధవారం నాగలి పట్టి దుక్కిదున్నారు. రోహిణి కార్తె వానాకాలం ప్రారంభంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు  స్వగ్రామం ఎల్లపల్లిలో తన పంట పొలంలో దుక్కి దున్ని వరి తుకం అలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తెలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వచ్చి రైతు కు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు కన్వీనర్‌ నల్ల వెంకట్‌రాంరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, ఎంపీసీ రామేశ్వర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు అల్లోల మురళీధర్‌ రెడ్డి,  సురేందర్‌ రెడ్డి, గౌతంరెడ్డి, ముత్యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T10:49:04+05:30 IST