‘సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయకుంటే పెనుముప్పు తప్పదు’

ABN , First Publish Date - 2021-05-07T18:32:19+05:30 IST

రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయకుంటే బెంగళూరు సహా పలు జిల్లాలకు పెనుముప్పు తప్పదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు

‘సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయకుంటే పెనుముప్పు తప్పదు’

                   - ఐఐఎస్‌సీ సర్వే 


బెంగళూరు: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయకుంటే బెంగళూరు సహా పలు జిల్లాలకు పెనుముప్పు తప్పదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయకుండా ఇదే తరహాలో వదిలిపెడితే బెంగళూరులో జూన్‌ ఆఖ రుకు 33లక్షల కరోనా కేసులు నమోదు కావచ్చునని అభిప్రాయపడ్డారు. ఐఐఎస్‌సి ప్రొఫెసర్‌లు శశికుమార్‌ గణేశన్‌, దీపక్‌సుబ్రమణిల నేతృత్వంలో అధ్యయన సమితి నివేదిక రూపొందింది. కరోనాకు బ్రేక్‌ పెట్టాలం టే నెలరోజుల కఠిన లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమని తేల్చారు. ఒకవేళ అమలు చేయకుంటే 30రోజుల్లో బెంగళూరులో 14.99 లక్షలు, ఆ తర్వాత మరింత పెరిగే అవకాశం ఉందని సూచించారు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోంది. 


Updated Date - 2021-05-07T18:32:19+05:30 IST