సమగ్ర దర్యాప్తు జరపాలని ఎస్పీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-29T06:05:38+05:30 IST

కొ ల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎ ల్లేని సుధాకర్‌రావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఎస్పీ కే.మనోహర్‌ను కోరింది.

సమగ్ర దర్యాప్తు జరపాలని ఎస్పీకి ఫిర్యాదు
ఎస్పీ కే.మనోహర్‌కు వినతిపత్రం అందిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు తదితరులు

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : కొ ల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఎస్పీ కే.మనోహర్‌ను కోరింది. 20రోజులు గా టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి బహిరంగ చర్చ పేరిట అశాంతి యు త వాతావరణాన్ని కల్పించారని వారు ఆరోపిం చారు. బహిరంగ చర్చ పేరిట నాటకీయ పరిణా మాలు చోటు చేసుకున్నాయని, సమాజంలో బా ధ్యత గల వీరిద్దరు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఎస్పీని కలిసిన వారిలో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్‌గౌడ్‌, మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజారమణి, ఆ పార్టీ జిల్లా నేతలు జలాల శివుడు, శ్రీనివాస్‌యాదవ్‌, మూలే భరత్‌చంద్ర, కడ్తాల కృష్ణయ్య, శశిరేఖ, రమేష్‌, హనుమంతు తదితరులున్నారు. 

మంత్రి కేటీఆర్‌కు బీజేపీ జిల్లా శాఖ బహిరంగ లేఖ

కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై వచ్చిన ఆరోపణలపై నిజాలు నిగ్గు తే ల్చాలని బీజేపీ నాగర్‌కర్నూల్‌ జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు టీ ఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఇరువురు నేతలు కొల్లాపూర్‌ నియో జకవర్గంలో వెనుకబాటుతనాన్ని విస్మరించారే తప్పా అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. వీరిద్దరి వేధింపుల కారణంగా అధికారులు నలిగిపోతున్నారని  లేఖలో స్పష్టం చేశారు. అర్థవంతమైన చర్చ జరిగి ఉంటే ఎవరి నిజాయితీ ఎంతో తేటతెల్లమయ్యేద న్నారు. 

Updated Date - 2022-06-29T06:05:38+05:30 IST