భర్త కనిపించడంలేదని ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-27T05:21:16+05:30 IST

బద్వేలు మున్సిపాలిటీలోని 29వ వార్డు నివాసి ఈశ్వరయ్య కన్పించడంలేదని ఆయన భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్బన్‌ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈశ్వరయ్య 29 వార్డు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. మార్చి నెల 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంది.

భర్త కనిపించడంలేదని ఫిర్యాదు
అదృశ్యమైన బద్వేలు 29వ వార్డు టీడీపీ అభ్యర్థి ఈశ్వరయ్య (ఫైల్‌ఫొటో)

వైసీసీవారే కిడ్నాప్‌ చేశారని టీడీపీ ఆరోపణ

బద్వేలు, ఫిబ్రవరి 26: బద్వేలు మున్సిపాలిటీలోని 29వ వార్డు నివాసి ఈశ్వరయ్య కన్పించడంలేదని ఆయన భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్బన్‌ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈశ్వరయ్య 29 వార్డు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. మార్చి నెల 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఈ నేపథ్యంలో ఇతను వారం నుంచి కనిపించడం లేదు. దీంతో ఇతడిని ఎవరైనా దాచిఉంచారో లేక అతనే ఎక్కడికైనా వెళ్లాడో అంతుచిక్కక అతడి భార్య, కుటుంబసభ్యులు టీడీపీ నేతలను ఆశ్రయించారు. దీంతో టీడీపీ నేతలు, బాధితులు కలిసి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీవారే ఈశ్వరయ్యను కిడ్నాప్‌ చేశారని రెండురోజుల్లో అతడిని తీసుకు రావాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి సీఐ రమేష్‌బాబును వివరణ కోరగా ఈశ్వరయ్య ఎక్కడికీ వెళ్లలేదని వరికోతలకు వెళ్లాడని అన్నారు. రెండు మూడు రోజుల్లో వస్తానని తనతో ఫోనలో చెప్పాడని అన్నారు.

Updated Date - 2021-02-27T05:21:16+05:30 IST