రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2021-03-08T05:36:59+05:30 IST

బండి ఆత్మకూరు, మార్చి 7: ఓంకార క్షేత్రంలో 10 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహిస్తున్నట్లు రైతు కమిటీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, నారాయణ తెలిపారు.

రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు

బండి ఆత్మకూరు, మార్చి 7: ఓంకార క్షేత్రంలో 10 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహిస్తున్నట్లు రైతు కమిటీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో  మాట్లాడతూ  10వ తేదీ పాలపండ్ల విభాగంలో పోటీ ఉంటుందని, మొదటి, రెండో, మూడో, నాలుగో, ఐదో విజేతకు వరుసగా రూ.35వేలు, రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు  అందజేస్తామన్నారు. 11న న్యూ కేటగిరి విభాగం పోటీల్లో విజేతలకు రూ.40వేలు, రూ.30వేలు,రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు ఇస్తామన్నారు. 12న సబ్‌జూనియర్స్‌ విభాగంలో విజేతలకు రూ.50వేలు, రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, చివరగా 13వ తేదీ సీనియర్‌ విభాగం పోటీలలో విజేతలకు రూ.60వేలు, రూ.50వేలు, రూ.35వేలు, రూ.25వేలు, రూ15వేలు ఇస్తారని వివరించారు. ఆసక్తి గలవారు ప్రవేశ రుసుం చెల్లించి పోటీలలో పాల్గొనాలని, పాల్గొనే వారు అఖిల భారత ఎడ్ల బలప్రదర్శన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

Updated Date - 2021-03-08T05:36:59+05:30 IST