గురువులను పూజించే చోట సమాజం అభివృద్ధి

ABN , First Publish Date - 2021-12-03T06:16:47+05:30 IST

గురువులు ఎక్కడ పూజింపబడతారో.. అక్కడ సమాజం బాగుపడుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని పూడిమడక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కృష్ణానంద్‌ పట్నాయక్‌ పదవీ విరమణ చేసిన సందర్భంగా శిష్యులు గురువారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు.

గురువులను పూజించే చోట సమాజం అభివృద్ధి
రిటైర్డు హెచ్‌ఎం కృష్ణానంద్‌ పట్నాయక్‌ సన్మాన సభలో మాట్లాడుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ

 సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

అచ్యుతాపురం, డిసెంబరు 2: గురువులు ఎక్కడ పూజింపబడతారో.. అక్కడ సమాజం బాగుపడుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని పూడిమడక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కృష్ణానంద్‌ పట్నాయక్‌ పదవీ విరమణ చేసిన సందర్భంగా శిష్యులు గురువారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు.  గురువులు ఎలా ఉంటే.. శిష్యులు కూడా అలాగే తయారవుతారన్నారు. అంబేడ్కర్‌ వంటి మేధావులు కూడా వారి గురువుల కారణంగానే ప్రఖ్యాతిగాంచారన్నారు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు గూగుల్‌ ద్వారా చదువు నేర్చుకుంటున్నా రన్నారు. గూగుల్‌ అన్నీ చెపుతున్నా.. గురువు చెప్పినట్లు ప్రవర్తన, విలువలు చెప్పదన్నారు. అంతకు ముందు అశ్వరథంపై కృష్ణానంద్‌ పట్నాయక్‌ దంపతులను శిష్యులు ఊరేగించారు.  కార్యక్రమంలో మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మల్లేశ్వరరావు, బోసు, శ్రీరాములు, వాసుపల్లి అప్పారావు, భాను పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T06:16:47+05:30 IST