సాధారణ జలుబులా కరోనా?

ABN , First Publish Date - 2021-01-14T07:19:17+05:30 IST

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇన్ఫెక్షన్‌.. భవిష్యత్తులో సాధారణ జలుబులా ప్రజల్లో పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ

సాధారణ జలుబులా కరోనా?

3-5 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం


న్యూఢిల్లీ, జనవరి 13 : ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇన్ఫెక్షన్‌.. భవిష్యత్తులో సాధారణ జలుబులా ప్రజల్లో పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. జలుబులా వచ్చిపోయే స్థితికి కరోనా ఇన్ఫెక్షన్‌ చేరిన తర్వాత.. సాధ్యమైనంత ఎక్కువమంది బాల్యంలోనే దాని బారినపడతారని వారు హెచ్చరించారు. ప్రధానంగా మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు తేలికపాటి కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ను సాధారణ జలుబు రూపంలో చవిచూడాల్సి రావచ్చన్నారు. ఇక పెద్దలను.. బాల్యంలో సోకిన ఇన్ఫెక్షన్‌తో కలిగిన రోగ నిరోధకత రక్షణ కవచంలా కాపాడుతుందని తెలిపారు. ప్రస్తుతం కరోనా టీకాలు వేయించుకునే వారికి తాత్కాలిక రక్షణే లభించినప్పటికీ, వ్యాక్సిన్ల ప్రభావంతో మరోసారి సోకే ఇన్ఫెక్షన్‌ తీవ్రత చాలామేరకు తగ్గుతుందన్నారు. సార్స్‌ వైర్‌సతో పాటు సాధారణ జలుబుకు కారణమయ్యే నాలుగు కరోనా వైరస్‌ రకాలపై అధ్యయనం ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ‘జర్నల్‌ సైన్స్‌’లో ప్రచురితమైంది. 

Updated Date - 2021-01-14T07:19:17+05:30 IST