కోర్టుకు జ్ఞానవాపి మసీదు సర్వే రిపోర్ట్.. మసీదులో ఆలయ అవశేషాలు

ABN , First Publish Date - 2022-05-19T18:26:50+05:30 IST

జ్ఞానవాపి మసీదు సర్వే రిపోర్ట్‌ని గురువారం వారణాసి కోర్టుకు ప్రత్యేక సర్వే కమిటీ అందించింది. సర్వేకి సంబంధించిన వీడియోని సీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు సమర్పించారు. కాగా, ఈ సర్వేలో సంచలన విషయాలు వెల్లడి అయినట్లు తెలుస్తోంది..

కోర్టుకు జ్ఞానవాపి మసీదు సర్వే రిపోర్ట్.. మసీదులో ఆలయ అవశేషాలు

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు సర్వే రిపోర్ట్‌ని గురువారం వారణాసి కోర్టుకు ప్రత్యేక సర్వే కమిటీ అందించింది. సర్వేకి సంబంధించిన వీడియోని సీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు సమర్పించారు. కాగా, ఈ సర్వేలో సంచలన విషయాలు వెల్లడి అయినట్లు తెలుస్తోంది. మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించిందట. విగ్రహాల ముక్కలు ఉన్నాయని, మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నాయట. త్రిశూలం, శేషనాగు పడగ, ఢమరుకం, గోడలపై కమలం గుర్తులు, హిందూ దేవతలకు సంబంధించిన బొమ్మలు కనిపించినట్లు కమిటీ పేర్కొంది. కాగా, మసీదు మొత్తాన్ని పురావస్తుశాఖ సర్వే చేయాలని డిమాండ్ లేవనెత్తింది. ఇదిలా ఉంటే శివలింగం కనిపించిన చోట తక్షణమే పూజలకు అనుమతించాలంటూ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2022-05-19T18:26:50+05:30 IST