డంపింగ్‌ యార్డు సందర్శించిన కమిషనర్‌

ABN , First Publish Date - 2022-09-27T06:19:47+05:30 IST

‘ముందు కొండలా పేరుకుపోయివున్న ఈ చెత్త తరలిం చండి. కాపులుప్పాడలోని జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు రోజుకి 900 నుంచి వెయ్యి టన్నుల చెత్త అవసరం.

డంపింగ్‌ యార్డు సందర్శించిన కమిషనర్‌
డంపింగ్‌ యార్డులో పరిస్థితి తెలుసుకుంటున్న కమిషనర్‌ రాజాబాబు

కొండలావున్న చెత్తను చూసి ఆశ్చర్యపోయిన వైనం

పదిహేను రోజుల్లోగా తరలించాలని ఆదేశం

విశాఖపట్నం, సెప్టెంబరు 26: ‘ముందు కొండలా పేరుకుపోయివున్న ఈ చెత్త తరలిం చండి. కాపులుప్పాడలోని జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు రోజుకి 900 నుంచి వెయ్యి టన్నుల చెత్త అవసరం. నగరంలో రోజుకు ఉత్పత్తి అయ్యే చెత్త 950 టన్నులు. అంటే ఏ రోజుకా రోజు చెత్త తరలించినా జిందాల్‌ అవసరం తీరుతుంది. నగరం పరిశుభ్రంగా ఉంటుంది. మరి ఎందుకు నిర్లక్ష్యం’...అంటూ జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు అధికారులకు క్లాసు తీసుకున్నారు.


క్షేత్ర స్థాయి పర్యటనలో భాగం గా సోమవారం ఆయన 13వవార్డులో పర్యటిం చారు. ఆరిలోవలోని డంపింగ్‌ యార్డుతోపాటు, వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆరిలోవ డంపింగ్‌ యార్డులో 6వేల టన్నులు చెత్త కొండలా పేరుకుపోయివుండడం చూసి ఆశ్చర్యపోయారు. గడ చిన వారం రోజుల్లో రెండువేల టన్నుల చెత్త తరలిం చారని అధికారులు తెలియజేయగా, మిగిలింది కూడా పదిహేను రోజుల్లో తరలించాలని అధికారులను ఆదే శించారు. అలాగే ఏ రోజు చెత్త ఆరోజు కాపులుప్పడ డంపింగ్‌ యార్డుకు తరలించాలన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై చెత్త ఎప్పటికప్పుడు తరిలిస్తామని, దీనివల్ల ఈ ప్రాంతవా సులకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం వార్డులోని శివాజీనగర్‌, అఫీషియల్‌ కాలనీ, దుర్గా నగర్‌, ఆరిలోవ ఆఖరి బస్టాప్‌, ఎంఎస్‌ఎఫ్‌-2 తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పలుచోట్ల చెత్తకుప్పలు, కాలువల్లో పూడిక ఉండడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, క్లాప్‌ వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లో నిర్ణీత సమయానికి ఉండాలని ఆదేశించారు. దుర్గానగర్‌ రైతు బజార్‌ను శివాజీనగర్‌లో నిర్మించిన రైతు బజార్‌ షెడ్లలోకి తరలించాలని, ఎంఎస్‌ఎఫ్‌-2 ప్రహరీని ఆనుకుని ఉన్న షెడ్లను తొలగించా లని, చాలా కాలువల్లో ప్లాట్‌ఫాంలు దెబ్బతి న్నందున మరమ్మతులు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్‌ కెల్ల సునీత సత్యనారాయణ కమి షర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు.


దీనిపై ఆయన స్పందిస్తూ వార్డు అభివృద్ధి పనుల్లో భాగంగా వాటిని చేర్చి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడతామని హామీఇచ్చారు.అనంతరం దబ్బం దలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను సందర్శించారు. ఇంకా 192 ఫ్లాట్లు నిర్మించాల్సి ఉన్నందున త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేవించారు. కమిషర్‌ వెంట అదనపు కమిషనర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధి కారి కె.ఎస్‌.ఎస్‌.జి.శాస్త్రి,యూసీడీ పీడీ పాపునాయుడు, జెడ్సీ బొడ్డేపల్లి రాము, ఏపీడీ గంగాథర్‌, ఏఎంఓహెచ్‌ కిశోర్‌, ఈఈ మత్సరాజు, డిప్యూటీ ఈఈ వంశీ, ఏఈ అప్పాజీ, శ్రీనివాస్‌, శానిటరీ సూపర్‌వైజర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టిడ్కో ఇంజనీర్లు, వార్డు సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T06:19:47+05:30 IST