లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-08-06T06:16:34+05:30 IST

ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద ఉధృతి అధికంగా ఉన్న నేపఽథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు బాధితుల పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి
మైక్‌ ప్రచారాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌

లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి

కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ 

రాణిగారితోట, ఆగస్టు 5: ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద ఉధృతి అధికంగా ఉన్న నేపఽథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు బాధితుల పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. గురువారం ఆయన అధికారులతో కలిసి తారకరామనగర్‌, భూపేష్‌ గుప్తానగర్‌తో పాటు ముంపు బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు మైక్‌ ద్వారా చేస్తున్న ప్రచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక ప్రమాదం వల్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం ఇందిరాగాంధీ స్టేడియం, రాణిగారితోట శాంపిల్‌ బిల్డింగ్‌, ఏపీఎస్‌ఆర్‌ఎం స్కూల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిందని, అక్కడకు వెళ్లాలని, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా స్థానికంగా కొన్ని కుటుంబాలు తమకు ఇళ్లు కేటాయించకుండానే తాము ఉంటున్న ఇళ్లు కూల్చేశారని న్యాయం చేయాలని కమిషనర్‌ను కోరారు. 

వీరి సమస్యను విన్న ఆయన అధికారులతో మాట్లాడతానని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు ఎం.ప్రభాకరరావు, వి.చంద్రశేఖర్‌, డా.ఇక్బాల్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-06T06:16:34+05:30 IST