ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-04-23T05:53:55+05:30 IST
బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లవీధి-అప్పయ్యపేట జంక్షన్‌లో మున్సిపల్ కాలువలను, స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారిపై మున్సిపల్ కమిషనరు సత్తారు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొబ్బిలి: బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లవీధి-అప్పయ్యపేట జంక్షన్‌లో మున్సిపల్ కాలువలను, స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారిపై మున్సిపల్ కమిషనరు సత్తారు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన గొల్లవీధి జంక్షన్ నుంచి అప్పయ్యపేట వరకు ఆక్రమణలను పరిశీలించారు. ఎరుకలివీధి, మహారాణిపేటలలో పర్య టించారు. ప్రభుత్వ, మున్సిపల్ స్ధలాలలను పెద్దఎత్తున కబ్జా చేసుకొని పక్కా కట్టడాలు, వ్యాపారాలు సాగించుకోవడంతో సంబంధిత వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఈ ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని ఆదేశించారు. శానిటరీఇన్‌స్పెక్టరు మురళి, పర్యావరణ ఇంజనీరు సోమేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.