Advertisement
Advertisement
Abn logo
Advertisement

నూరుశాతం చెత్త సేకరణ జరగాలి

గుంటూరు(కార్పొరేషన్‌), అక్టోబరు 23: నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరుశాతం జరగాలని, అలాగే రోడ్లమీద, కాల్వల్లో వ్యర్థాలు వేసే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలని కమిషనర్‌ అనురాధ అన్నారు. శనివారం కమిషనర్‌ ఇజ్రాయేల్‌పేట, ఆర్టీసీ కాలనీలలో పర్యటించారు. ప్రతి ఇంటి నుంచి ఆర్‌ఎఫ్‌ఐడీ, ట్యాగ్‌ని స్కాన్‌ చేయాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎన్విరాన్మెంట్‌, ప్లానింగ్‌, ఎమినిటీ కార్యదర్శులు రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జాయింట్‌ విజిట్‌ చేయాలన్నారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు, టీపీఎస్‌ స్రవంతి, ఏఈ వెంకటేశ్వరరావు, రత్నం తదితరులు పాల్గొన్నారు.  


Advertisement
Advertisement