మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-04-21T05:19:50+05:30 IST

నగరంలో కేసులు అధికంగా నమోదు అయ్యే ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లను మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌గా గుర్తించాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ అధికారులను ఆదేశించారు.

మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించాలి
అధికారులకు సూచనలిస్తున్న కమిషనర్‌

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 20: నగరంలో కేసులు అధికంగా నమోదు అయ్యే ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లను మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌గా గుర్తించాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ అధికారులను ఆదేశించారు. స్థానిక బ్రాడీపేట, పట్టాభిపురం ప్రాంతాల్లో మంగళవారం కమిషనర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌ ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని, సున్నం, బ్లీచింగ్‌ చల్లించి, డిస్‌ ఇన్‌స్పెక్షన్‌  చేయాలని  ఆదేశించారు. కాలువల నిర్మాణం అనంతరం కాంట్రాక్టరే నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలన్నారు. పర్యటనలో డిప్యూటీ సిటీ ప్లానర్‌ హిమబిందు, ఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, డిఈఈశ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:19:50+05:30 IST