కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అప్‌గ్రేడ్‌

ABN , First Publish Date - 2022-08-18T06:32:43+05:30 IST

చిత్తూరులోని జేసీ బంగ్లాకు సమీపంలో ఉన్న అప్‌గ్రేడ్‌ చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను బుధవారం ఎస్పీ రిషాంత్‌రెడ్డి ప్రారంభించారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అప్‌గ్రేడ్‌
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ట్రాఫిక్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు, ఆగస్టు 17: చిత్తూరులోని జేసీ బంగ్లాకు సమీపంలో ఉన్న అప్‌గ్రేడ్‌  చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను బుధవారం ఎస్పీ రిషాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్‌ సమస్యతో పాటు దొంగతనాలు, నేరస్తుల కదలికలను తెలుసుకోవడానికి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జిల్లాలోని పలమనేరు, పుంగనూరు, నగరి, కుప్పం పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇది వరకే కొన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, మిగిలిన చోట్లా విడతల వారీగా అమర్చేందుకు చర్యలు  చేపడతామన్నారు. ఇది వరకు చిత్తూరుల్లోని 50 ప్రాంతాల్లో 123 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. రెండు  రోజుల క్రితం 31 ప్రాంతాల్లో 100 కెమెరాలను ఏర్పాటు అమర్చామన్నారు. నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే సిబ్బంది పర్యవేక్షించి.. సంబంధిత పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. ఫిర్యాదుదారులకు స్టేషన్‌లో సరైన న్యాయం జరగనప్పుడు తాను కూడా వారితో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి నేరుగామాట్లాడే అవకాశం ఉందన్నారు.  సీసీ కెమెరాలను అమర్చడం వల్ల యాదమరి సమీపంలో హౌస్‌ బ్రేకింగ్‌ కేసు, బీవీరెడ్డికాలనీలోని బద్రినారాయణ ఇంట్లో దొంగతనం, కట్టమంచిలో  దొంగతనం,  చైన్‌స్నాచింగ్‌, గాంధీ బొమ్మ వద్ద హత్య కేసును ఛేదించగలిగినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ నరసింహరాజు, ట్రాఫిక్‌ డీఎస్పీ తిప్పేస్వామి, కమాండ్‌ కంట్రోల్‌ సీఐ బీఎ్‌సకే నాయుడు, ఎస్‌ఐ మధు, ఆర్‌ఐ మధు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:32:43+05:30 IST