సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్ ప్రశాంతి
ఉండి, మే 25: వలంటీర్లు ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. మహదేవపట్నం గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. మీ సేవ సర్వీసులు పూర్తిస్థా యిలో సచివాలయంలో అందించాలన్నారు. గ్రామంలో చెత్త ఎక్కడబడితే అక్కడ వేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. డీపీవో ఎం.నాగలత, గృహనిర్మాణశాఖ ఈఈ బి. వెంకటరమణ, తహసీల్దారు కృష్ణజ్యోతి, ఎంపీడీవో గంగాధరరావు, గ్రామ కార్యదర్శి పవన్‌కుమార్, వీఆర్వో కుమార్ తదితరులు పాల్గొన్నారు.