ఏలూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రేవు ముత్యా లరాజు పిలుపునిచ్చారు. పూలే 130వ వర్థంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. జేసీలు వెంకటరమణారెడ్డి, హిమాంశు శుక్లా, తేజ్ భరత్, డీఆర్వో శ్రీనివాస మూర్తి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవీ కృష్ణారావు, వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.