పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2020-07-09T11:03:53+05:30 IST

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్‌ శ్రుతి ఓ ఝా, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

కలెక్టర్‌ శ్రుతి ఓఝా


ఇటిక్యాల/ వడ్డేపల్లి/ జూలై 8 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్‌ శ్రుతి ఓ ఝా, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. ఇ టిక్యాల మండలంలోని చాగాపురం, బడ్డారెడ్డిపల్లి గ్రామాలలో ఆరో విడత హరితహారంలో భాగం గా వారు మొక్కలు నాటారు. అంతకుముందు చాగాపూరం గ్రామంలోని ఏఈఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్పంచులు గోవిందమ్మ, ఎర్ర న్న, ఎంపీపీ స్నేహాశ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ హన్మంతురెడ్డి, జిల్లా వ్యవసాయాదికారి గోవిందనాయ క్‌, ఏడీఏ షక్రీయానాయక్‌, తహశిల్దార్‌ శివలిం గం, ఎంపీడీఓ రామమహేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ రాముడు, ఆర్‌ఐ సుదర్శన్‌రెడ్డి, ఏఓ ఆయూబ్‌ పాల్గొన్నారు.


హరితహారంలో భాగంగా ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం మొక్కలు నాటి నీళ్లు పో శారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీహరి తదితరు లు పాల్గొన్నారు. వడ్డేపల్లి మండలంలోని తిమ్మాజిపల్లెలో బుధవారం అధికారులు మొక్కలు నా టి వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఎంపీడీవో రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 

మూడు షిప్టులుగా కరోనా పరీక్షలు

గద్వాల (ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షలను మూడు షిప్టులో నిర్వహించాలని, వెంట వెంటనే ఫలితాలు వచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అన్నారు. వైదాధికారులతో బుధవా రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుం చి వస్తున్న నమోనాలను పరీక్షించి త్వరతగతిన ఫలితాలు అందించాలని సూచించారు.


పాజిటివ్‌ కేసులు వస్తే ఆయా జిల్లాల అధికారులకు వెం టనే సమాచారం అందించాలని అదేశించారు. దీనికి తోడు ప్రైవేట్‌ ఆసుపత్రులకు దగ్గు, జ్వరం, ఇతర వ్యాధులతో వచ్చే వారి వివరాలను సేక రించాలన్నారు. ఈ విషయంలో జిల్లా వైద్యాధికా రితో పాటు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా తిరగాలని సూ చించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి భీంనాయక్‌, సూపరింటెండెంట్‌ శోభారాణి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T11:03:53+05:30 IST