Advertisement
Advertisement
Abn logo
Advertisement

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్‌

బుట్టాయగూడెం, అక్టోబరు 27: నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయడంలో అలసత్వం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. కేఆర్‌.పురం ఐటీడీఏ కార్యాలయంలో జంగారెడ్డిగూ డెం, కుక్కునూరు డివిజన్ల పరిధిలోని అధికారులు, ఉద్యోగులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్‌ కానివారు ఏఒక్కరూ ఉండకూడ దని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉద్యోగులు సమన్వయంతో పనిచే యాలన్నారు. ప్రతివారం మండలస్థాయి అధికారులకు గ్రేడింగ్‌ ఇస్తామన్నా రు. జీఎస్‌డబ్ల్యూ, మీసేవ ఫిర్యాదులను తహసీల్దార్లు పరిష్కరించాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను అధిగమించడంలో వాస్తవికతకు దగ్గరగా ఫలితా లు ఉండాలన్నారు. అన్నిశాఖలు పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆదేశిం చారు. ప్రభుత్వం అమలుపరచే సంక్షేమ పథకాలకు డిజిటల్‌ రశీదులు తీసు కోవాలన్నారు. జిల్లా డివిజన్‌ స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాల ని, తహసీల్దార్లు, ఎంపీడీవోలు విద్యా, వసతిగృహాల పనితీరుపై దృష్టి పెట్టా లన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ చాలా ముఖ్యమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని రహదారుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. కొయ్యలగూడెం, జీలుగు మిల్లి రహదారులకు మరమ్మతులు సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో 53 వేల మంది 18 సంవత్సరాలు నిండినవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయవలసి ఉందన్నారు. వార్డులు, వలంటీర్లు వారికి వ్యాక్సినేషన్‌ చేయవల సినవారిని గుర్తించి లక్ష్యాలను అధిగమించాలన్నారు. జేసీలు బీఆర్‌.అంబే డ్కర్‌ (రెవెన్యూ) సూరజ్‌ గానోరె (గృహ నిర్మాణం), హిమాన్షు శుక్లా (అభి వృద్ధి) ఆయా శాఖల ప్రగతిపై సమీక్ష చేసి మంచి ఫలితాలు సాధిం చాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఓ.ఆనంద్‌, ఆర్డీవో వైవీ.ప్రసన్న లక్ష్మి, డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement