జర్నలిస్టులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-01-14T06:57:06+05:30 IST

ఈ నెల 16 నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హామీ ఇచ్చారు.

జర్నలిస్టులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం
ఏపీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌, యూనియన్‌ నేతలు

కలెక్టర్‌ ఇంతియాజ్‌       

విజయవాడ సిటీ : ఈ నెల 16 నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హామీ ఇచ్చారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్‌ యూనిట్‌ ముద్రించిన మీడియా డైరీ 2021ను కలెక్టర్‌ బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కరోనా మహ్మమ్మారి నివారణ చర్యల్లో జర్నలిస్టుల సహకారం, కృషి అభినందనీయమన్నారు. అక్రిడిటేషన్‌ మంజూరులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్‌ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు చలపతిరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T06:57:06+05:30 IST