వనటైమ్‌ సెటిల్మెంట్‌ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-21T06:00:49+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద వనటైమ్‌ సెటిల్మెంట్‌ సర్వేని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు.

వనటైమ్‌ సెటిల్మెంట్‌ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి

టెలీ కాన్ఫరెన్సలో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంతపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద వనటైమ్‌ సెటిల్మెంట్‌ సర్వేని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోని క్యాంపు కార్యాలయంలో వనటైమ్‌ సెటిల్మెట్‌, కోవిడ్‌ వ్యాక్సినేషన, ఫీవర్‌ సర్వే తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండలస్థాఇ అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ది) ఏ సిరితో క లిసి జిల్లా కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... జగనన్న సం పూర్ణ గృహ పథకం కింద వనటైమ్‌సెటిల్మెంట్‌ సంబంధించి 1.50 లక్షల మంది లబ్దిదారులకు సంబంధించి సర్వే పెండింగ్‌ ఉండగా.... అం దులో గురువారం 75వేల మంది లబ్ధిదారుల సర్వే పూర్తి కావాలని లక్ష్యం నిర్ణ్యయించగా... 37వేల మంది ప్రజల సర్వేపూర్తి చేసి 50 శాతం మాత్రం లక్ష్యం చేరుకున్నారన్నారు. రిసర్వే విషయమై రోజువారి పురోగతి సాధించాలని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయం చేసుకుని జాగ్రత్తగా పనిచేయాలని, నిజమైన లబ్దిదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సర్వే చేపట్టి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కరోనా మూడవ దశలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫీవర్‌ సర్వే 4వ వారం చేపట్టడం జరుగుతోందని, అందులో ఇప్పటివరకు కేవలం 50శాతం మాత్రమే ఫీవర్‌ సర్వే పూర్తి కావడం జరిగిందని, ఫీవర్‌ సర్వేకు ప్రాధాన్యత ఇవ్వకరుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, శ్రద్ద పెట్టి ఫీవర్‌ సర్వే 100 శాతం ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. మండల సాఆ్థయిలో కకూడా కేసులు ఎకకుఉ్కవగా వస్తతనన్నన నేపథ్యంలో ఫీవర్‌ సర్వే పూర్తి చేయాలని, సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. కోవిడ్‌ వ్యాక్సినేషనకు సంబందిఇంచి పెండింగ్‌ ఉన్న రెండో వ్యాక్సినేషన పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-01-21T06:00:49+05:30 IST