అందరికీ సంక్షేమం

ABN , First Publish Date - 2022-01-27T07:04:27+05:30 IST

అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ‘అందరికీ సంక్షేమం’ నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తితో దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

అందరికీ సంక్షేమం

  అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం
  దేశ సమగ్రత, జిల్లా ప్రగతికి కృషి చేయాలి
 కలెక్టర్‌ హరికిరణ్‌ పిలుపు

కాకినాడ క్రైం, జనవరి 26 : అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ‘అందరికీ సంక్షేమం’ నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తితో దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ప్రగతికి సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పిలుపునిచ్చారు. 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబుతో కలసి గౌరవ వందనం, కవాతుల తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను సద్విని యోగం చేసుకుంటూ, దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో బాధ్యతలను నిర్వర్తిస్తూ దేశప్రగతికి సమష్టిగా పునరంకితం కావాలని కోరారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కార్యక్రమం కింద ఈ ఏడాది జిల్లాలో 4.54 లక్షల రైతు కుటుంబాలకు రూ.525 కోట్ల సాయం అందించామన్నా రు. సున్నావడ్డీ పథకం కింద 71 వేల రైతులకు రూ.9.41 కోట్ల వడ్డీ రాయితీ, యంత్ర సేవా పథకం ద్వారా 437 రైతు గ్రూపులకు రూ.4.23 కోట్ల రాయితీతో యంత్ర పరికరాలు రైతులకు అందించడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల ద్వారా రూ.13 కోట్ల నిధులతో ఉద్యాన పంటల విస్తరణ, పునరుద్ధరణ ప్రణాళిక జిల్లాలో అమలవుతోందన్నారు. జగనన్న పాలవెల్లువ కింద 7,871 పాడి పశుయూనిట్లు, 1774 మేకలు, గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్‌ఆర్‌ పింఛను పథకం కింద జిల్లాలో 5.78 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1 నుంచి 2,250ల నుంచి రూ.2500లకు పెంచి పంపిణీ చేస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా కింద దాదాపు 96 వేల మంది మహిళలకు రూ.1394 కోట్లు, చేయూత పథకం కింద 2.52 లక్షల మంది మహిళలకు రూ.897 కోట్లు, సున్నా వడ్డీ కింద 1.6 లక్షల మహిళా సంఘాలకు రూ.72 కోట్లు వడ్డీ రాయితీగా ఈ ఏడాది అందించడం జరిగిందన్నారు. విద్యారంగం ప్రగతిలో భాగంగా మనబడి నాడు-నేడు కార్యక్రమం తొలిదశ కింద రూ.374 కోట్ల నిధులతో 1331 పాఠశాలలను అభి వృద్ధి చేశామన్నారు. రెండో దశ కింద మరో 1300 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కొవిడ్‌ కట్టడికి వైద్యఆరోగ్య శాఖ, వివిధ శాఖల సమన్వయంతో ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టిన బహుముఖ కార్యాచరణను వివరించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో 3.25 లక్షల కుటుంబాలకు సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఇప్పటి వరకు 1.22 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీ చేసి, సర్వహక్కులతో ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కురసాల కన్నబాబు కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించా రు. ఈ సందర్భంగా ప్రభుత్వశాఖలు, ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సంస్థలు, వివిధ రంగాల ప్రగతికి కృషిచేస్తున్న ప్రముఖులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని తెలియజేసే శకటాలను ప్రదర్శించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, జేసీలు కీర్తి చేకూరి, ఏ భార్గవ్‌తేజ, సుమిత్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్లు స్వప్నిల్‌ దినకర్‌, అభిషిక్త్‌ కిషోర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T07:04:27+05:30 IST