అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-10-20T04:54:38+05:30 IST

జిల్లాలో అక్రమ మద్యం, నాటు సారాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు

అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం
పోలీస్‌,ఎక్సైజ్‌ శాఖ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మిశ్రా

ఏలూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమ మద్యం, నాటు సారాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ఎక్సైజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మద్యం, బెల్ట్‌ షాపులు, నాటుసారా నియంత్రణకు ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే 9550351100 నెంబర్‌కు వాట్సప్‌ ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి మద్యం అక్రమాల నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో పోలీస్‌ సూపరింటెండెంట్‌ రాహూల్‌ దేవ్‌ శర్మ, జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌, ఎక్సైజ్‌ శాఖ విజిలెన్స్‌ విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ రేణుక, ఎస్‌ఈబీ ఏఎస్సీ జయ రామరాజు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ భార్గవ, ఎక్సైజ్‌ అధికారులు గౌరీశ్వర్‌రెడ్డి, పాండురంగారావు, మూర్తిరాజు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T04:54:38+05:30 IST