ఆలయంలో కలెక్టర్ డా.మల్లికార్జున దంపతులు
సింహాచలం, జనవరి 28: వరాహలక్ష్మీనృసింహస్వామిని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈవో ఎంవీ సూర్యకళ కలెక్టర్ దంపతులకు పూర్తి అధికార లాంఛనాలతో ఆహ్వానం పలుకగా, బేడామండప ప్రదక్షిణ చేసిన తరువాత కలెక్టర్ గోత్రనామాలతో పురోహితులు కరి సీతారామాచార్యులు పూజలు చేసి, శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు స్వస్తివచనాలతో వేదాశీర్వచనాలీయగా, ఈఓ శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.