సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్‌ వెంకటేష్‌

ABN , First Publish Date - 2022-05-19T05:27:21+05:30 IST

గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సద్విని యోగం చేసు కోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు.

సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్‌ వెంకటేష్‌
భీమడోలులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పరిశీలిస్తున్న కలెక్టర్‌

దెందులూరు, మే 18 :గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సద్విని యోగం చేసు కోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. బుధవారం దెందులూరు మండలంలోని కొవ్వలిలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ చేసే కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం గ్రామంలోని మొటపర్తి భవన్‌లో అఽధికారు లతో పారిశుధ్యం పరిరక్షణ, తాగునీటి సమస్యలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల వినియోగంపై తహసీల్దార్‌ వి.నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మీలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నీటి ఎద్దడి ఎదుర్కొ నేందుకు మిషన్‌ అమృత సరోవర్‌ పథకంలో భాగంగా చెరువులు, నీటి కుంటల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారి శుధ్యం విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తేడా వస్తే సహించేది లేదన్నారు. సర్పంచ్‌ మధులత గంగాధారావు, పంచాయతీ కార్యదర్శి చౌదరి పాల్గొన్నారు.

భీమడోలులో  పర్యటన 

భీమడోలు, మే 18 : భీమడోలు గ్రామంలో జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సుడిగాలి పర్యటన చేశారు. భీమడోలులోని 3వ నెంబర్‌ గ్రామ సచివా లయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, వలంటీర్ల హాజరును, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను కలెక్టర్‌ పరిశీలించారు. అనం తరం గ్రామ సచివాలయం వద్ద గ్రామస్థులు, సచివాలయ సిబ్బందితో సమా వేశం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యంపై స్థానికులను అడిగి తెలు సుకు న్నారు. అనంతరం చెత్త నుంచి సంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు.  భీమడోలు లోని దిగుడుపాటి దిబ్బ సమీపంలోని ఇళ్ల కాలనీని ఆయన సందర్శించారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఎంపీపీ రామయ్య, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌, డీపీవో బాలాజీ, తహసీల్దార్‌ సుబ్బారావు, ఎంపీడీవో సూర్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-05-19T05:27:21+05:30 IST