మోడల్‌ విలేజ్‌గా చల్లపల్లి

ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST

స్వచ్ఛ సంకల్పం అమలులో భాగంగా చల్లపల్లిని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు. చల్లపల్లిలోని సంపద తయారీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ సందర్శించి వర్మికంపోస్ట్‌ తయారీని పరిశీలించారు.

మోడల్‌ విలేజ్‌గా చల్లపల్లి
చల్లపల్లి లే అవుట్‌ను సందర్శించి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

 కలెక్టర్‌ రంజిత్‌ బాషా వెల్లడి 

 స్వచ్ఛ సంకల్పం అమలుపై సమీక్ష 

 స్వచ్ఛ సారథి డీఆర్‌కె ప్రసాద్‌కు అభినందన

చల్లపల్లి, మే 24 : స్వచ్ఛ సంకల్పం అమలులో భాగంగా చల్లపల్లిని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు. చల్లపల్లిలోని సంపద తయారీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ సందర్శించి వర్మికంపోస్ట్‌ తయారీని పరిశీలించారు. గ్రా మంలో చెత్తసేకరణ, పారిశుధ్య నిర్వహణ, సంపద తయారీ కేంద్రం నిర్వహణ గురించి స్వచ్ఛసారథి డాక్టర్‌ డిఆర్‌కె.ప్రసాద్‌, సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పి.సుకుమార్‌ కలెక్టర్‌కు వివరించారు.  స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం, శ్మశాన వాటిక అభివృద్ధి,  ఉద్యానవన నిర్వహణను తెలుసుకున్న కలెక్టర్‌ స్వచ్ఛ సారథి డీఆర్కేకు అభినందనలు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, స్వచ్ఛ కార్యక్రమాలు, సంపద తయారీ కేంద్రం నిర్వహణలో చల్లపల్లి మోడల్‌గా ఉందన్నారు.  చల్లపల్లిని జిల్లాలోనే మోడల్‌ విలేజ్‌ తీర్చిదిద్దుతామనీ,  అవసరమైన మౌలిక సదుపాయాలను రెండు నెలల్లో సమకూర్చుతామన్నారు. చల్లపల్లి వచ్చిన కలెక్టర్‌కు చేతిసంచిని బహూకరించిన డీఆర్కే స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ ప్రస్థానాన్ని ల్యాప్‌టా్‌పలో ఫొటోల ద్వారా చూపించారు. డీపీవో జ్యోతి, ఆర్డీవో కిషోర్‌, డీఎల్‌పీవో జ్యోతిర్మయి, సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, కార్యదర్శి పి.సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 చల్లపల్లి లే అవుట్‌  పరిశీలన

లే అవుట్‌లలో నూరుశాతం గృహనిర్మాణాలు ప్రారంభించేలా లబ్ధిదారులను చైతన్యవంతం చేయాలని  కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. చల్లపల్లిలో నూతన లే అవుట్‌ను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. తహసీల్ధార్‌ ఎం.సతీ్‌షకుమార్‌, సర్వేయర్‌ ఎ.కిషోర్‌బాబులను వివరాలు అడిగి తె లుసుకున్నారు. గృహనిర్మాణాలపై హౌసింగ్‌ అధికారులతో సమీక్షించారు.  350కు పైగా గృహనిర్మాణాలు చేపట్టినట్లు చెప్పగా, నిర్మాణాలు వేగవంతం చేయాల్సి ఉందన్నారు. గృ హనిర్మాణాల విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.  విద్యుత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో మాట్లాడారు. డీపీవో ఎడి.జ్యోతి, బందరు ఆర్డీవో ఐ.కిషోర్‌, హౌసింగ్‌ పీడీ కె.రామచంద్రన్‌, ఈఈ మోహనరావు, ఎంపీడీవో గంజి శ్రీనివాసరావు, డీఈ భానూజీరావు, ఏఈ శేషగిరిరావు, సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపురం సచివాలయ సందర్శన

లక్ష్మీపురం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ రంజిత్‌బాషా ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయంలో సిబ్బంది హాజరును పరిశీలించి వివిధ పథకాల లబ్ధిదారులు, అనర్హుల జాబితాలను చూశా రు. పంట ప్రయోగాలు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు.  కలెక్టర్‌ మారినప్పటికీ ఉన్నతాధికారుల జాబితా అప్‌డేట్‌ చేయకపోవటం తో ఆగ్రహం వ్యక్తం చేశారు.  



Updated Date - 2022-05-24T05:30:00+05:30 IST