ఉత్తమ ఎన్నికల నిర్వహణ అధికారిగా కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-21T05:28:32+05:30 IST

రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణాధికారిగా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న గవర్నర్‌ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. కలెక్టర్‌తో పాటు జిల్లాలో మరో నలుగురు అధికారులకు కూడా ఉత్తమ పురస్కారాలు లభించాయి. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఉత్తమ ప్రతిభ చూపిన ఎస్‌.కోట స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, ఉత్తమ ఈఆర్‌వోగా వ్యవహరించిన గజపతినగరం తహసీల్దార్‌ ఎం.అరుణకుమారి, విజయనగరం నియోజకవర్గంలో బీఎల్‌వోగా వ్యవహ రించిన వార్డు హెల్త్‌ సెక్రటరీ జంగం

ఉత్తమ ఎన్నికల నిర్వహణ అధికారిగా కలెక్టర్‌
కలెక్టర్‌ సూర్యకుమారి


25న గవర్నర్‌ చేతులమీదుగా పురస్కారం

జిల్లాలో మరో నలుగురు అధికారులకు పురస్కారాలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జనవరి 20: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణాధికారిగా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న గవర్నర్‌ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు.  కలెక్టర్‌తో పాటు జిల్లాలో మరో నలుగురు అధికారులకు కూడా ఉత్తమ పురస్కారాలు లభించాయి.  ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి  ఉత్తమ ప్రతిభ చూపిన ఎస్‌.కోట స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, ఉత్తమ ఈఆర్‌వోగా వ్యవహరించిన గజపతినగరం తహసీల్దార్‌ ఎం.అరుణకుమారి, విజయనగరం నియోజకవర్గంలో బీఎల్‌వోగా వ్యవహ రించిన వార్డు హెల్త్‌ సెక్రటరీ జంగం పుష్ప, ఐటీ నిపుణులు ఎం.నాగరాజు ఉత్తమ ఎస్‌ఎల్‌ఏగా ఎంపికయ్యారు. 


Updated Date - 2022-01-21T05:28:32+05:30 IST