తొలి విడతలో 1,11,099 ఇళ్ల నిర్మాణం

ABN , First Publish Date - 2020-12-04T06:28:54+05:30 IST

జిల్లాలో తొలివిడతలో భాగంగా 1,11,099 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు.

తొలి విడతలో 1,11,099 ఇళ్ల నిర్మాణం
ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

ఆరు నెలల్లో అన్ని సౌకర్యాలతో పూర్తి చేయాలి

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

అనంతపురం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలివిడతలో భాగంగా 1,11,099 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఆరు నెలల్లో అన్ని సౌకర్యాలతో నివసించే విధంగా ఇళ్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌తో కలిసి సబ్‌ కలెక్టర్‌, ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం తదితర అంశా లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో 2,03,199 మందికి ఇళ్ల పట్టాలను ఈనెల 25న పంపిణీ చేస్తున్నామన్నారు. కోర్టు కేసుల కారణంగా 6405 మందికి పట్టాల పంపిణీ ఆగిపోయిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుని వారికి కూడా పట్టాలిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.  ఇళ్ల  పట్టాలిచ్చే స్థలాలు లేఅవుట్లు, రోడ్లు తదితర సౌకర్యాలతో ఉండాలన్నారు. చేసే ప్రతిపనిలోనూ నాణ్యత కనిపించాలన్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణంలో మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ఉందా లేదా అని తనిఖీలు చేసేందుకు మండల స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేయాలని డ్వామా పీడీ వేణు గోపాల్‌ను ఆదేశించారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఎంపిక లాటరీ పద్ధతి ద్వారానే జరిగి ఉండాలన్నారు. ఈ విష యంలో ఎక్కడా వివాదం తలెత్తకూడదన్నారు. సామాజిక వర్గాల వారిగా ఒకేచోట ఇచ్చి ఉంటే వాటిని అంగీకరించ మన్నారు. వీటిని ఆర్డీఓలు తనిఖీ చేయాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన చోట శుక్రవారం నుంచి లేఅవుట్‌ అభివృద్ధి పనులు ప్రారంభించాలని హౌసింగ్‌ పీడీని ఆదేశించారు. లేఅవుట్‌ అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపునకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల ద్వారా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసు కున్న 14217 మందికి అర్హతను పరిశీలించి ఇళ్లపట్టాలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం జేసీ నిశాంత్‌కు మార్‌ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులతో పట్టాల పంపిణీ అంశంపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆసరా జేసీ గంగాధర్‌గౌడ్‌, సబ్‌ కలెక్టర్‌ నిశాంతి, డీఆర్వో గాయిత్రిదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T06:28:54+05:30 IST