ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-15T07:09:18+05:30 IST

బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

కలెక్టరేట్‌, అక్టోబరు 14: బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎస్‌.వెం కట్రావు చెప్పారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, మండల అధికా రులతో వెబినార్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వర్షాలపై సమీక్ష చేశారు. వర్షాల వల్ల బాగా నాని కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను గుర్తించాలన్నారు. అందులో ఉంటున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నీరు ని ల్వ ఉండే ప్రదేశాలకు ఎవరూ వెళ్లొద్దన్నారు. దుస్తులు ఉతికేందుకు, ఈత కొటేటందుకు, చేపలు పట్టేందుకు వెళ్లొద్దన్నారు. జలాశయాలు పొంగి నీరు వచ్చే రహదారులు, బ్రిడ్జీలు, కాజ్‌వేలు, రైల్వేట్రాక్‌లు, వాగులు, వంకలు, చెరువులను గుర్తించాలన్నారు.


పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కలెక్టర్‌ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా బృందాలను నియమించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.  ఏదైన సమా చారం ఉంటే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08542- 241165కు తెలుపాలన్నారు. ఎంపీడీవోలు, తహసీ ల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు అప్రమత్తమై ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించాలన్నారు. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, కూలిన ఇండ్లు, తెగిన చెరువు లు, వాగులు, వంకలు, రహదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టం రిపోర్టులను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


సర్వేకు రెండు రోజులు మినహాయింపు

జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు ఆస్తుల నమోదు సర్వేలో పాల్గొంటున్న దృష్ట్యా పంట నష్టం వివరాలను సేకరించేందుకు రెండు రోజులు సర్వే వారికి మినహాయంపు ఇస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వర్షాల కారణంగా ఆస్తుల నమోదు ప్రక్రి యలో కొంత మేరకు జాప్యం జరిగినప్పటికి అధికా రులు, సిబ్బంది సాధ్యమైనంత మేరకు వేగవంతం చేసి, త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నందలాల్‌ పవర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


రైతు వేదికలను దసరాలోపు పూర్తి చేయాలి

మిడ్జిల్‌: రైతు వేదికలను దసరాలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు చెప్పారు. బుధవారం ఆయన మండలంలోని రాణిపేట, చిల్వేర్‌, మిడ్జిల్‌ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక భవనాల పనులను పరిశీలించారు. చిల్వేర్‌లో వర్షానికి దెబ్బతిన్న రైతు మల్లయ్య పత్తి పంటను చూశారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేశారు. కోవిడ్‌ 19 నియంత్రణపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. జాగ్రత్తల గురించి వివరించారు. శాఖల వారీగా అధికారులతో మాట్లాడారు. మండల కేంద్రంలోని ఇంటింటి సర్వేను పరిశీలించారు. మిడ్జిల్‌లో సర్వే నత్తడనకన కొనసాగుతుందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సాయిలక్ష్మీ, తహసీల్దార్‌ శ్రీనువాసులు, ఎంపీవో అనురాధ, ఏఓ సిద్ధార్థ, ఆయా గ్రామాల ప్రజాప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు. 


పత్తి పంట పరిశీలన

జడ్చర్ల: వర్షాలకు మండలంలోని గంగాపురం శివారులో దెబ్బతిన్న గంగాపురం గ్రామానికి చెందిన రైతు నరేందర్‌రెడ్డి పత్తి పంటను కలెక్టర్‌ వెంకట్రావు బుధవారం పరిశీలించారు. పత్తి నాని మొలకెత్తడాన్ని చూశారు. మండలంలో సుమారు 8 వేల ఎకరాలలో పత్తి పంట, 700 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు మండల వ్యవసాయ అధికారి రాంపాల్‌ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, దెబ్బతిన్న ఇళ్లు, నష్టం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, మునిసిపల్‌ కమిషనర్‌ సునీత, ఇన్‌చార్జి ఎంపీడీఓ జగదీశ్వర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-15T07:09:18+05:30 IST