Abn logo
May 22 2020 @ 04:24AM

అర్హులందరికీ ఇంటి స్థలం అందాలి : కలెక్టర్‌

అనంతపురం, మే21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి ఆయన ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు ఇంటిస్థలం ఇచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికే గడువు పూర్తయిందన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించాలన్నారు.


అనర్హులకు జాబితాలో చోటివ్వొద్దన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించినపుడు తమకు ఇంటి స్థలం ఇవ్వలేదని అర్హులెవరూ అనకూడదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎంపికచేసే 94412 ప్లాట్లకుగానూ అన్నిరకాల పనులు పూర్తి చేసుకుని 88805 ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన ప్లాట్లలో పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రూ.1.50 లక్షల మందికి ఇంటి స్థలమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూన్‌ 7న అర్హుల తుది జాబితా ప్రదర్శించేందుకు అధికారులు సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ-2 రామ్మూర్తి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఆర్వో గాయత్రీదేవి, ప్రత్యేకాధికారి వరప్రసాద్‌, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళిరెడ్డి, డ్వామా పీడీ ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement