కాఫీకి డిమాండ్‌

ABN , First Publish Date - 2022-01-22T06:17:38+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ గింజల కొనుగోలు ధరలు పెరుగుతున్నాయి. కాఫీ సాగుకు ప్రసిద్ధి చెందిన వియత్నాం, బ్రెజిల్‌ దేశాల్లో ఈ ఏడాది దిగుబడులు తగ్గడంతో మార్కెట్‌లో కాఫీ ధరలు పెరిగాయని స్థానిక కాఫీ బోర్డు జేఎల్‌వో శ్రీరమణ తెలిపారు.

కాఫీకి డిమాండ్‌

బెంగళూరు మార్కెట్‌లో పార్చిమెంట్‌ కిలో రూ.318, చెర్రీ రూ.140

నాలుగేళ్ల తరువాత గరిష్ఠ ధరలు

వియత్నాం, బ్రెజిల్‌ దేశాల్లో దిగుబడులు తగ్గడమే కారణం


చింతపల్లి, జనవరి 21: అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ గింజల కొనుగోలు ధరలు పెరుగుతున్నాయి. కాఫీ సాగుకు ప్రసిద్ధి చెందిన వియత్నాం, బ్రెజిల్‌ దేశాల్లో ఈ ఏడాది దిగుబడులు తగ్గడంతో మార్కెట్‌లో కాఫీ ధరలు పెరిగాయని స్థానిక కాఫీ బోర్డు జేఎల్‌వో శ్రీరమణ తెలిపారు. బెంగళూరు మార్కెట్‌లో శుక్రవారం అరబిక రకం పార్చిమెంట్‌ కిలో రూ.318, చెర్రీ రూ.140 ధర పలికాయని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నాలుగేళ్ల తరువాత కాఫీ గరిష్ఠ ధర పలుకుతుండడంతో ప్రాంతీయ మార్కెట్‌లలోనూ డిమాండ్‌ పెరిగిందని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం ఏజెన్సీలో ప్రైవేటు వర్తకులు పార్చిమెంట్‌ కిలో రూ.270-280కు చెర్రీ కిలో రూ.115-125లకు కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతుండడంతో ఏజెన్సీలోని కాఫీ రైతులు ఆ మేరకు ధర లభించేలా ప్రైవేటు వర్తకులను డిమాండ్‌ చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-01-22T06:17:38+05:30 IST