కో-ఎడ్యుకేషన్‌ కళాశాలగా కొసాగించాలి

ABN , First Publish Date - 2022-06-26T06:14:47+05:30 IST

అగనంపూడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బాలికల కళాశాలగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేయడాన్ని నిరసిస్తూ 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు.

కో-ఎడ్యుకేషన్‌ కళాశాలగా కొసాగించాలి
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన

అగనంపూడి, జూన్‌ 25: అగనంపూడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బాలికల కళాశాలగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేయడాన్ని నిరసిస్తూ 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గంధం శ్రీనివాసరావు, కార్పొరేటర్‌  శ్రీనివాసరావులు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కో-ఎడ్యుకేషన్‌ కళాశాలగా పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు ఇంటర్‌ విద్యను అందిస్తున్న ఈ కాలేజీని కేవలం బాలికలకు కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కళాశాలలో మూడు వందల మంది బాలికలు చదువుతున్నారని, భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య తక్కువగా వుందని కాలేజీని ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. అందేవల్ల దీనిని కో-ఎడ్యుకేషన్‌గా కళాశాలగా కొనసాగించాలని కోరారు. లేకుంటే ఈ ప్రాంత నిరుపేద బాలుర విద్యార్థులు ఇంటర్‌ విద్యకు దూరం అవుతారన్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ సుశీల్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అంద జేశారు. కార్యక్రమంలో గాజువాక టీడీపీ నమన్వయకర్త, 85వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కర్రి దశేంద్ర, నాయకులు నెల్లి శ్రీనివాసరావు, బలిరెడ్డి సత్యనారాయణ, ఏదూరి గౌరి, బొబ్బరి సూర్య, జి.అప్పారావు, సుబ్బరాజు, విళ్లా రామ్మోహన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T06:14:47+05:30 IST