కొబ్బరి రైతులు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-01T08:53:46+05:30 IST

కొబ్బరి రైతులు కోకోనట్‌ బోర్డు ద్వారా వచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ స్మార్ట్‌ విలేజ్‌ డైరెక్టర్‌ వైఎస్‌.మైఖేల్‌ అన్నారు. కత్తిమండలో స్మార్ట్‌విలేజ్‌వారి ఆధ్వర్యంలో మిషన్‌-

కొబ్బరి రైతులు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

మలికిపురం, సెప్టెంబరు 30: కొబ్బరి రైతులు కోకోనట్‌ బోర్డు ద్వారా వచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ స్మార్ట్‌ విలేజ్‌ డైరెక్టర్‌ వైఎస్‌.మైఖేల్‌ అన్నారు. కత్తిమండలో స్మార్ట్‌విలేజ్‌వారి ఆధ్వర్యంలో మిషన్‌-4 కిసాన్‌ అనే కార్యక్రమం నిర్వహించారు. మల్లిపూడి రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులు కొబ్బరిలో అంతర పంటలు పండించుకుని అధిక లాభాలు పొందవచ్చు నన్నారు.


ప్రకృతి వ్యవసాయం-మార్కెట్‌ అనుసంధానం అనే అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో చెంపాటి శివరామరాజు, దత్తకుమార్‌, గంటా సునీల్‌, కేసరి మునీశ్వరరావు, శివాజీ, కాశి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T08:53:46+05:30 IST