యువ‌కుని ప్యాంట్‌లోకి దూరిన పాము... త‌రువాత‌?

ABN , First Publish Date - 2020-07-29T15:55:34+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక పెద్ద పాము యువకుడు ధ‌రించిన‌ జీన్స్ ప్యాంటులోకి దూరింది. దీంతో ఆ యువకుడు రాత్రంతా స్తంభం పట్టుకొని, భయాందోళనతో క‌ద‌ల‌కుండా నిలుచున్నాడు.

యువ‌కుని ప్యాంట్‌లోకి దూరిన పాము... త‌రువాత‌?

మిర్జాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక పెద్ద పాము యువకుడు ధ‌రించిన‌ జీన్స్ ప్యాంటులోకి దూరింది. దీంతో ఆ యువకుడు రాత్రంతా స్తంభం పట్టుకొని, భయాందోళనతో క‌ద‌ల‌కుండా నిలుచున్నాడు. తెల్లారాక పాములు ప‌ట్టేవారు వ‌చ్చి ఆ పాముని యువకుని ప్యాంటు నుంచి మెల్ల‌గా బ‌య‌ట‌కు బయటకు తీశారు. ఈ స‌మాచారం అందుకున్న‌ పోలీసులు, ప‌లువురు స్థానిక అధికారులు, వందలాది గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఉదంతం జమాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికందర్‌పూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో విద్యుత్‌శాఖ విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసే పనులు నిర్వ‌హిస్తోంది. ఈ ప‌నులు చేసేందుకు వ‌చ్చిన కార్మికులు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో రాత్రిపూట నిద్రిస్తున్నారు. ఆ కార్మికుల‌లో ఒక‌డైన లవ్లేష్ నిద్రిస్తుండ‌గా, ఒక‌ విషపూరిత పాము అత‌ని ప్యాంటులోకి దూరింది. భ‌యంతో ఆ యువ‌కుడు వెంట‌నే లేచి అక్క‌డే ఉన్న స్తంభాన్ని ప‌ట్టుకుని, క‌ద‌లకుండా రాత్రంతా నిలుచున్నాడు. ఉద‌యం‌ స్థానికులు ఈ విష‌యాన్ని తెలుసుకుని, ద‌గ్గ‌ర‌లో ఉన్న పాములు ప‌ట్టే వ్య‌క్తిని పిలిపించారు. అత‌ను సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ల‌వ్లేష్ ప్యాంటులోకి దూరిన పామును అత్యంత చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌కు తీశారు. ఈ సందర్భంగా పంచాయతీ సభ్యుడు మహేష్ సింగ్ మాట్లాడుతూ ల‌వ్లేష్ అనే కార్మికుని ప్యాంటులోకి పాము దూర‌డంతో అత‌ను భయంతో క‌ద‌లకుండా ఏడు గంట‌ల‌పాటు నిలుచున్నాడ‌‌ని తెలిపారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అంబులెన్స్‌ను కూడా పిలిపించామ‌న్నారు. అయితే పాములు ప‌ట్టేవారి చొర‌వ‌తో ఆ పామును బ‌య‌ట‌కు తీయ‌గ‌లిగామని అన్నారు. ల‌వ్లేష్‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. 

Updated Date - 2020-07-29T15:55:34+05:30 IST