నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ

ABN , First Publish Date - 2022-05-27T05:24:24+05:30 IST

నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ

నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ
ఎల్వోసీ అందజేస్తున్న ఎంపీపీ రవీందర్‌యాదవ్‌

కేశంపేట, మే 26: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని ఎంపీపీ రవీందర్‌యాదవ్‌ అన్నారు. కేశంపే టకు చెందిన నక్క లక్ష్మమ్మ రెండు నెలల నుంచి గుండె సంబంధి త సమస్యతో నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆపరేషన్‌ అ వసరం అని డాక్టర్లు తెలపడంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ను సంప్రదించారు. ఆయన స్పందించి రూ.3లక్షల ఎల్‌వోసీ(లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) ఇప్పించారు. గురువారం ఎక్లా్‌సఖాన్‌పేటలో ఎంపీపీ రవీందర్‌.. లక్ష్మమ్మ కుటంబీకులకు ఎల్‌వోసీ అందించారు. కేశంపేట సర్పంచ్‌ తలసాని వెంకట్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, విఠల్‌, శేఖర్‌, నక్క గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం


ఆమనగల్లు: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆర్థి క భరోసాను కల్పిస్తోందని జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటి సభ్యుడు నెనావత్‌ పత్యానాయక్‌, జెడ్పీటీసీ అనురాధ అన్నారు. ప్ర జారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయ నన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ నుచ్చుగుట్ట తండాకు చెందిన నెనావత్‌ బుజ్జి అనారోగ్యంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయిం చుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్‌ సహకారంతో ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిఽధి ద్వారా రూ.60వేలు మంజూ రయ్యాయి. గురువారం బాధిత కుటుంబానికి పత్యానాయక్‌, అనురాధ చెక్కు అందజేశారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చుక్క నిరంజన్‌గౌడ్‌, ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీ(పాక్స్‌) డైరెక్టర్‌ దోళ్యా, ఏఎంసీ డైరెక్టర్‌ రమేశ్‌నాయక్‌, నాయకులు నెనావత్‌ గణేశ్‌, గన్యా, ఈశ్వర్‌, రాజు, వినోద్‌, రమేశ్‌, నర్సింహ, హేమ్లా, బుజ్జి, పకీరా పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:24:24+05:30 IST