నెలాఖరులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-25T05:50:04+05:30 IST

నెలాఖరులోగా 2019-20 వానా కాలం సీఎంఆర్‌ (కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌) పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి

నెలాఖరులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 24: నెలాఖరులోగా 2019-20 వానా కాలం సీఎంఆర్‌ (కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌) పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వి వెంకటేశ్వర్లుతో కలిసి రైస్‌ మిల్లర్లనుద్దేశించి మాట్లాడారు. ఇదివరకే గడువును పలుమార్లు పెంచుతూ వచ్చామని, సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాల న్నారు. లేని పక్షంలో ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.


ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, శాఖాపరంగా తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వానాకాలం సీజన్‌కు సం బంధించి రైస్‌మిల్లులు బాయిల్డ్‌ రైస్‌మిల్లుల నుంచి 6600 మెట్రిక్‌ టన్ను ల బియ్యం ఎఫ్‌బీఐకి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈనెల 30లోగా బియ్యంను ఎఫ్‌సీఐకి తరలుతుందో రిపోర్టును రోజూ తెలియజేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ గోపాల్‌, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్మాస్‌ కాంతయ్య, ఎమ్మార్వోలు పి.రాజేశ్వర్‌రావు, మోహన్‌రె డ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు గోవింద్‌, కొండయ్య, విజయ, అన్వేష్‌, రైస్‌ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు. 


సకాలంలో నర్సరీ పనులు పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితాహారంలో భాగం గా ఏడవ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంతా సిద్ధం గా ఉండాలని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో హరితాహారానికి సంబంధించి 311 గ్రామపంచాయతీలలో మొక్కలు పెంచేందుకు అవసరమైన పాలిథిన్‌ కవర్లు, టేకు స్టంప్స్‌, విత్త నాలకు సంబంధించి హైదరాబాద్‌, నల్గొండ, చిట్యాల నుంచి వివిధ కం పెనీల సీల్డ్‌ టెండర్లను తెరిచిన అనంతరం కలెక్టర్‌ ధరలను నిర్ణయిం చారు.  డీఆర్‌డీఏ పీడీ బిశేషాద్రి, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అదికారి జాదవ్‌ప్రకాశ్‌, ఇండస్ట్రీస్‌ జీఎం హరినాథ్‌, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T05:50:04+05:30 IST