ఎనిమిది నెలల్లో ఎన్నో నెరవేర్చాం: CM

ABN , First Publish Date - 2022-01-14T15:56:24+05:30 IST

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే తాను వివిధ సందర్భాల్లో, శాసనసభలో, బహిరంగ సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లో చేసిన ప్రకటనల్లో 75 శాతం నెరవేర్చానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు.

ఎనిమిది నెలల్లో ఎన్నో నెరవేర్చాం: CM

చెన్నై: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే తాను వివిధ సందర్భాల్లో, శాసనసభలో, బహిరంగ సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లో చేసిన ప్రకటనల్లో 75 శాతం నెరవేర్చానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు. సంకాంత్రి సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 36 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని, ఆ సంఖ్యను మూడు నెలల్లోనే ఐదు వందలకు తగ్గించగలిగామని, కరోనా బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తున్నామని తెలిపారు. కరోనా సాయం క్రింది రేషన్‌కార్డుదారులకు రూ.4 వేలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని, ఆవిన్‌పాల ధరను రూ.3ల వరకు తగ్గించానని, కరోనా సంక్షోభంలో ప్రజలను ఆదుకునేలా 13 రకాల కిరాణా సరకులను ఉచితంగా అందజేశామని ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో చేసిన హామీలనే కాకుండా కొత్త పథకాలను కూడా అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన 2619 ఫైళ్ళపై సంతకాలు చేశానని చెప్పారు. 


దివ్యాంగుల సంక్షేమ కార్యాలయం ప్రారంభం...

విల్లుపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో కోటి రూపాయలతో కొత్తగా నిర్మించిన దివ్యాంగుల సంక్షేమ కార్యాలయాన్ని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. 3243 చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ కార్యాలయ భవనంలో వినికిడి లోపం చిన్నారుల శిక్షణా కేంద్రం, ప్రత్యేక మరుగుదొడ్లు, దివ్యాంగులు వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు కల్పించామన్నారు.

Updated Date - 2022-01-14T15:56:24+05:30 IST