Abn logo
Oct 21 2021 @ 00:27AM

సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరం : ఎమ్మెల్యే రవీంద్ర

చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ, అక్టోబరు 20: ముఖ్యమంత్రి సహా యనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ అన్నారు. నియోజకవర్గంలోని 77మందికి మం జూరైన రూ.18లక్షల 68వేల 500ల విలువైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ ముఖ్య మంత్రి సీఎం సహాయనిధి అందజేసి ఆదుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారేపాకల అరుణసు రేష్‌గౌడ్‌, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, చింతపల్లి సుభాష్‌గౌడ్‌, పున్న వెంకటేష్‌, హనుమంతు వెంకటేష్‌గౌడ్‌, వల్లపురెడ్డి పాల్గొన్నారు.