CM KCR review: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం సమీక్ష

ABN , First Publish Date - 2022-08-02T21:30:33+05:30 IST

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష (review) నిర్వహించారు.

CM KCR review: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం సమీక్ష

హైదరాబాద్ (Hyderabad): స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష (review) నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ ఛైర్మన్ కేశవరావుతో సహా 24 మంది సభ్యులు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, సీఎస్, డీజీపీ, నారదాసు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. దేశ సమైక్యతా, దేశ భక్తిని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 


కాగా రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలు సిద్ధం చేశారు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శనలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. కాగా ఆగస్టు 8వ తేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

Updated Date - 2022-08-02T21:30:33+05:30 IST