వేములవాడ రాజన్నకు శఠగోపం పెట్టిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-08-14T06:16:38+05:30 IST

వేములవాడ రాజన్నకు శఠగోపం పెట్టిన సీఎం కేసీఆర్‌ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి వంద కోట్ల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ నిధులు విడుదల చేయకుండా శఠగోపం పెడుతున్నాడని బీజేపీ సీనియర్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేములవాడ రాజన్నకు శఠగోపం పెట్టిన సీఎం కేసీఆర్‌
సిరిసిల్లలో మాట్లాడుతున్న మృత్యుంజయం

మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం

సిరిసిల్ల రూరల్‌, అగస్టు 13 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి వంద కోట్ల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ నిధులు విడుదల చేయకుండా శఠగోపం పెడుతున్నాడని బీజేపీ సీనియర్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శనివారం   ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాజన్న పేరుతో సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధికి  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిధులు విడుదల చేయడం లేదన్నారు. రాజన్న దేవునికి తండ్రీకొడుకులు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. ధనిక రాష్ట్రంగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఉచిత పథకాలను ప్రకటించి రాష్ట్రాన్ని  ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా మార్చివేశారని విమర్శించారు.  రాష్ట్రంలో ఉన్న3,600 దేవాలయాలకు ఆరు నెలల నుంచి  దూపదీప నైవేద్యాలు కరువైపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేతన్న పథకం నేతన్నలు బతికిఉండగా పనికిరాకుండా పోయిందని కేవలం నేతన్నలు చనిపోతేనే ఈ పథకం వర్తిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టును గోదావరి వరుదలే ముంచి వేయడంతో లక్షలాది కోట్ల రూపాయలను గోదావరిలో కలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎగువ మానేరు నింపేందుక ఏర్పాటు చేసిన ప్యాకేజీని మంత్రి కేటీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. సిరిసిల్ల మానేరు వాగులో నిర్మించిన చెక్‌డ్యాంలు వరుదలకు కోట్టుకుపోయినా మంత్రి కేటీఆర్‌ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే దమ్ము లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మీ, ఓబీ సీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు బర్కం నవీన్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T06:16:38+05:30 IST