- కలెక్టరేట్, టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం
జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 20న ఆయన జిల్లాకు వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంతో పాటు యశ్వంతాపురం వద్ద నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. కాగా, సీఎం పర్యటనలో భాగంగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.