సీఎం కేసీఆర్‌ పెద్ద మోసకారి

ABN , First Publish Date - 2021-07-31T04:35:32+05:30 IST

కేసీఆర్‌ పెద్ద మోసకారి, ఏవైనా ఎన్నికలు వచ్చినప్పుడే ఆ యనకు సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు.

సీఎం కేసీఆర్‌ పెద్ద మోసకారి
వనపర్తి పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నాయకులు

వనపర్తి అర్బన్‌, జూలై 30: కేసీఆర్‌ పెద్ద మోసకారి, ఏవైనా ఎన్నికలు వచ్చినప్పుడే ఆ యనకు సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు.  ‘బడుగుల ఆత్మగౌరవ పోరు’ సభకు శుక్రవారం హైదరాబాద్‌ వెళ్తున్న బీజేపీ నాయ కులను పట్టణ పోలీసులు ముందస్తుగా అరె స్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భం గా నారాయణ మాట్లాడుతూ కేసీఆర్‌ పెద్ద మోసకారి అని రాష్ట్రంలో ఏవైనా ఎన్నికలు వ చ్చినప్పుడే ఆయనకు సంక్షేమ పథకాలు గుర్తొ స్తాయని, ఆ పథకాలు కూడా ఎన్నికలు పూర్తి కాగానే మర్చిపోతారని అన్నారు. ప్రజాస్వా మ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నా రని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని కేసీఆర్‌ ముందస్తు అరెస్టులు చేసి అడ్డుకుంటున్నారని అన్నారు. అరెస్ట్‌ అయిన వారిలో బీజేపీ జిల్లాకార్యదర్శి పరశురాం, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు, అధికార ప్రతినిది పెద్దిరాజు, మాజీ అధికార ప్రతినిధి బచ్చు రాం, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కుమార్‌, పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్‌ ఉన్నారు.

వీపనగండ్లలో..

వీపనగండ్ల : హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘బడుగుల ఆత్మగౌరవ పోరు’ కార్య క్రమానికి శుక్రవారం బీజేపీ మండల నాయకు లు తరలివెళ్ళారు. దళితులకు 3 ఎకరాల భూ మి, ఎస్టీలకు పోడు భూములకు పట్టాలివ్వాల ని ధర్నా నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షుడు రాకేష్‌ తెలిపారు. ధర్నాకు వెళ్లిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య, విజయ్‌, బీజేవై యం మండల ప్రధాన కార్యదర్శి మధు, కేశవు లు, రమేష్‌, రామకృష్ణ, లోకేష్‌ ఉన్నారు.

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు దగ్గర శుక్రవారం చేపట్టిన ‘బడుగుల ఆత్మగౌర వ పోరు’ కార్యక్రమానికి తరలివెళ్తున్నారని బీజేపీ మండల నాయకులను ఎస్‌ఐ విజయ భాస్కర్‌ తెల్లవారుజామున ముందస్తుగా అరె స్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  అరెస్ట్‌ అయిన వారిలో  బీజేపీ మండల ఉపాధ్యక్షుడు  వెంకటేష్‌ యాదవ్‌, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, తిరుపతియాదవ్‌, శివశంకర్‌, సురేష్‌, భగవంతు, రవి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-31T04:35:32+05:30 IST