Hyderabad కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-08-04T19:31:14+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురువారం ప్రారంభమైంది.

Hyderabad కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (command control center) గురువారం ప్రారంభమైంది.  ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేతుల మీదుగా సీసీసీ(CCC) ప్రారంభోత్సవం జరిగింది.  టవర్ ‘ఏ’ లోని 18వ ఫ్లోర్‌లో సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) ఛాంబర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం లాంఛనంగా తన ఛాంబర్‌లో సీపీ బాధ్యతలు స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయా మత పెద్దలతో సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.


కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ విభాగాలను సీఎం సందర్శించారు. టవర్ D లో మ్యూజియంను కేసీఆర్ సందర్శించారు. తెలంగాణ పోలీస్ చరిత్రను తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేశారు. మొదటి కొత్వాల్ రాజ బహుదూర్ కాలం నుండి పోలీస్ వ్యవస్థ ఎలా ఫంక్షన్ అవుతుంది తెలిపేలా మ్యూజియను నిర్మించారు. మ్యూజియంలో అలనాటి పోలీస్ వ్యవస్థను తెలిపే పోటో గ్రాఫ్స్‌ను ప్రదర్శించారు. మ్యూజియం గురించి సీఎం కేసీఆర్‌కు సీపీ ఆనంద్ వివరించారు. మరోవైపు సీసీసీ ప్రారంభం నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

Updated Date - 2022-08-04T19:31:14+05:30 IST