నగర శివారు ప్రాంతాల అభివృద్ధిలో సీఎం కేసీఆర్‌ విఫలం

ABN , First Publish Date - 2022-08-19T04:33:19+05:30 IST

నగర శివారు ప్రాంతాల అభివృద్ధిలో సీఎం కేసీఆర్‌ విఫలం

నగర శివారు ప్రాంతాల అభివృద్ధిలో సీఎం కేసీఆర్‌ విఫలం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి

  • ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 18: నగర శివారు ప్రాంతాల అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఎంపీపీ తీవ్రంగా ఖం డించారు. ఈ మేరకు ఆయన గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో విలేకరులతో ఎంపీపీ మాట్లాడారు. 2017లో మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలానికి వెయ్యి డబుల్‌ బెడ్‌రూంలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల జాడే లేదన్నారు. నగర శివారు ప్రాంతాలను అభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. స్థానిక సంస్థలకు నిధులు లేక, చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. ఘట్‌కేసర్‌ మండలం మాదారంలో 300ఎకరాలలో టీ-హబ్‌ను ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పి ంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ యేటా స్థానిక సంస్థలకు రూ.379కోట్ల చొప్పున నిధులు వచ్చాయని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతిగ్రామంలో పల్లె ప్రగతి, డంపింగ్‌ యార్డు, శ్మశానవాటికలు, రైతువేదికలు, రైతు కల్లాల నిర్మాణం చేశారని గుర్తుచేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదన్నారు. అబద్ధాన్ని వందసార్లు చెప్పినంత మాత్రాన నిజం కాదన్నారు. గతంలో కేటీఆర్‌ ఘట్‌కేసర్‌ ఉమ్మడి మండలానికి వచ్చి అభివృద్ధి పనులకు రూ.25కోట్లు కేటాయిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చిల్లిగవ్వ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకర్గంలో నిర్మించి న డబుల్‌బెడ్‌ రూంల ఇళ్లను స్థానికులకే కేటాయించాలని, మాదారంలో 300 ఎకరాల్లో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలని, పేద ఎస్సీలందరికీ దళితబంధు వర్తింపజేయాలని చేయాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో అవినీతి పాలన అంతానికి కేసీఆర్‌ చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కోరారు.

Updated Date - 2022-08-19T04:33:19+05:30 IST