కాపులను మోసం చేసిన సీఎం జగన : టీడీపీ

ABN , First Publish Date - 2021-07-26T06:05:59+05:30 IST

వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో జగన ప్రభుత్వం కాపులకు తీరని అన్యాయం చేసిందని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ ప్రదాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రామాంజినమ్మలు అన్నారు.

కాపులను మోసం చేసిన సీఎం జగన : టీడీపీ
సమావేశంలో మట్లాడుతున్న టీడీపీ నాయకులు

హిందూపురం, జూలై 25: వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో జగన ప్రభుత్వం కాపులకు తీరని అన్యాయం చేసిందని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ ప్రదాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రామాంజినమ్మలు అన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆర్బాటంగా విడుదల చేసి కాపు నేస్తంపై ఆదివారం హిందూపురంలో ఎమ్మెల్యే నివాసంలో వారు మట్లాడుతూ కాపు మహిళలకు ఏటా 15 వేల చోప్పున ఐదేళ్లల్లో 75 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన ఆర్భాటంగా ప్రకటించారన్నారు. బడ్జెక్టు సమావేశాల్లో కోటిన్నర మందికి కాపులు ఉన్నట్లు ప్రకటన చేసి ముఖ్యమంత్రి జగన లభ్థిదారుల విషయంలో కేవలం 2.35 లక్షల మంది మాత్రమే పరిమితి చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు గాలికి వదిలేయడం కార్పోరేషనకు నిధులు కేటాయించకపోవండతో మోసం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కాపుల రిజర్వేషన్ల కోసం చంద్రబాబు శ్రమించారన్నారు. బీసీ కమిషన ఏర్పాటు చేసి కేంద్రం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌కు లొబడే 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని కాపుల పట్ల చిత్తశుద్దిని చాటుకున్నారన్నారు. అదే విధంగా కాపు కార్పోరేషన ఏర్పాటు చేసి 3100 కోట్ల విడుదల చేసి సంక్షేమానికి కృషి చేసినట్లు చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే కాపు 5 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం, కాపులను అన్ని వర్గాలుగా అణగదొక్కారాన్నారు. జగన ప్రభుత్వానికి కాపులు గట్టిగా  బుద్దిచెప్తారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు అమర్‌నాథ్‌, రమే్‌షకుమార్‌, శివకుమార్‌, శ్రీనివాసరెడి, నబీరసూల్‌, నజీర్‌, విజయలక్ష్మీ, కాపు నాయకులు ప్రభాకర్‌, వెంకటేష్‌, అశ్వత్థనారాయణ, చెన్నకృష్ణ, అనిల్‌కుమార్‌, శ్రీనివాసులు, మహేష్‌, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-26T06:05:59+05:30 IST