ఏపీని మరో శ్రీలంకగా మార్చిన సీఎం జగన

ABN , First Publish Date - 2022-05-17T06:13:23+05:30 IST

ఏపీని మరో శ్రీలంకగా మార్చిన ఘనత ముఖ్య మంత్రి జగనకే దక్కుతుందని మాజీమంత్రి పల్లెరఘునాథరెడ్డి ఎద్దెవా చేశారు.

ఏపీని మరో శ్రీలంకగా మార్చిన సీఎం జగన
ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి





బుక్కపట్నం, మే 16: ఏపీని మరో శ్రీలంకగా మార్చిన ఘనత ముఖ్య మంత్రి జగనకే దక్కుతుందని మాజీమంత్రి పల్లెరఘునాథరెడ్డి ఎద్దెవా చేశారు. మండలంలోని మారాల గ్రామానికి చెందిన నారాయణప్ప ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నాయకులు, అధికారులపై చర్యలు తీసుకో వాలంటూ టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన స్థాని క ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేప ట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ....నారాయణప్ప ప్రభుత్వం ఇచ్చే పింఛనతో జీవనం సాగించేవాడని, స్థానిక వైసీపీ నాయకుడు దివాకర్‌రెడ్డి, స్థానిక అధికారులు చేసిన తప్పిదంతో  ఆత్మహ త్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఇది ముమ్మాటీకీ ప్రభుత్వ హత్యే అన్నారు. అలాగే మూడేళ్ల కాలంలో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఆయన మామ కలిసి ఇసుక దందాలు, భూ ఆక్రమణ లకు పాల్పడి ప్రజలను ఇబ్బందిపెట్టిన సంగతి అందరికీ తెలుసన్నారు. జగన ప్రభుత్వం ఇప్పటివరకు నిరుద్యోగులకు ఏమీ చేయలేదని చదువు కున్న వారు కూలి పనులకు వెళుతున్నారన్నారు. ప్రజలను మభ్యపె డు తూ వేల కోట్ల రూపాయలు దోచుకుని దాచుకుంటున్నారన్నారు. ఉద్యో గులకు నెలలో పదిరోజులు గడిచినా జీతాలు అందడంలేదన్నారు.   జగన ప్రభుత్వం 2024లో నామరూపాలు లేకుండా పోవాలని ప్రజలు దేవుడిని  వేడుకుంటాన్నారన్నారు. అనంతరం ఎంపీడీఓ వెంకటరామిరెడ్డికి వినతిప త్రంఅ ందజేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌నాయకులు పెద రాశు సుబ్రహ్మణ్యం, వెంకటనారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, బొట్టు కిష్టప్ప్ట, మీసాల మురళి, సయ్యద్‌, కరణం శ్రీరాములు, సామకోటి ఈశ్వరయ్య, తెలుగుమహిళా అధ్యక్షురాలు లావణ్యగౌడ్‌, మాజీ సర్పంచ యఽశోదరా యుడు, ఐటీడీపీ నాయకులు సాయిప్రసాద్‌, మంజునాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:13:23+05:30 IST